పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లను పీఎం విశ్వకర్మ యోజన జిల్లా కన్వీనర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్, భద్రాచలం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు సోమవారం అందజేశారు. చేతి వృత్తులను భారతదేశ వ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న చేతి వృత్తిదారులు వినియోగించుకోవాలని కోరారు.