భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి గుంటూరు వాస్తవ్యులు భాష్యం లక్ష్మీ ప్రసన్న- రామకృష్ణ దంపతులు లక్ష రూపాయలను సోమవారం విరాళంగా అందించారు. రామకృష్ణ దంపతులు ఆలయ కార్యనిర్వాణాధికారి రమాదేవికి చెక్కును అందజేశారు. అనంతరం దాత రామకృష్ణకు ఆలయ ఈవో స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.