భద్రాచలం రెడ్ క్రాస్ బిల్డింగ్లో నిర్మించిన నూతన తలసేమియా వార్డును శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య రాష్ట్ర గవర్నర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక పరిస్థితులు, గిరిజనుల జీవన విధానం, ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడం గురించి చర్చించారు.