మావోయిస్టులమని చెప్పి లొంగిపోవడానికి వచ్చిన ముగ్గురు నకిలీ మావోయిస్టులను ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్లోని బలోద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు పునరావాసంతో పాటు నజరానాతో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. డబ్బులు వస్తాయని ఆశ పడ్డారో ఏమో ఆ యువకులు మావోయిస్టులమని పోలీసులనే నమ్మించారు. దీంతో కటకటాల పాలయ్యారు.