బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన రాహుల్ రెడ్డి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న రాహుల్ రెడ్డి గత కొంతకాలంగా ఉద్యోగం రాలేదని మనో వేదనతో ఉంటూ బుధవారం ఉదయం పురుగులు మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.