దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.