చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గత కొద్దికాలంగా సెంట్రల్ లైటింగ్ వెలగకపోవడంతో సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు.