బ్యాంకులో అప్పు ఉండటంతో తనకు వచ్చే పింఛను ఇవ్వకుండా చంద్రుగొండ ఏపీజీవీ బ్యాంకు మేనేజరు హోల్డ్ లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని రావికంపాడుకు చెందిన వృద్ధుడు రెడ్డి పోగు గోపయ్య శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా తాను హోల్డ్ లో పెట్టలేదని, వృద్ధుడు తన వద్దకే రాలేదని తెలిపారు. ఖాతాలో పడ్డ సొమ్ము ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు.