కాగజ్నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ కు చెందిన వర్తక వ్యాపారి శుక్రవారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. అంత బాధలో కూడా కుటుంబ సభ్యులు సమాజ హితం కాంక్షించి మృతుని నేత్రాలను హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి కుటుంబ సభ్యులను అభినందించారు.