హైదరాబాద్ లోని ఎఫ్టీసీసీఐలో ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో శుక్రవారం బడ్జెట్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో అనేక కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు. బడ్జెట్ మీద చూపిస్తున్న అంకెలకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. కార్యక్రమంలో సాయిప్రసాద్, శ్రీనివాస్, తదితరులున్నారు.