కాగజ్‌నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తికాక పోవడం బాధాకరం అన్నారు. బ్రిడ్జి కోసం వేసిన అప్రోచ్ కొట్టుకుపోయేలా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు. నాసిరకం నిర్మాణ పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.