కాగజ్‌నగర్ పట్టణం సర్‌సిల్క్ కాలనీకి చెందిన అబ్దుల్ ఖలీల్ తన మొబైల్ ను పోగొట్టుకుని టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గురువారం టౌన్ సీఐ పీ రాజేంద్రప్రసాద్ అట్టి మొబైల్ ను సీఈఐఆర్ సీ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి బాధితునికి అప్పగించారు. సీఐ మాట్లాడుతూ.. ఎవరిదైనా మొబైల్ పోగొట్టుకున్నా, దొంగలించబడినా వెంటనే సీఐఈఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయడం ద్వారా త్వరగా మొబైల్‌ను ట్రేస్ చేయవచ్చన్నారు.