కాగజ్‌నగర్ పట్టణం ఈఎస్ఐ ఆసుపత్రి డిస్పెన్సరీకి చెందిన మందులు ఇటీవల కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ మందుల షాపులో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. మందులు విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సీపీఎం నాయకులు ముంజం ఆనంద్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లాకు వినతిపత్రం అందజేశారు. మందులు అక్రమ విక్రయంపై ప్రత్యేక కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.