ఆసిఫాబాద్: మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

79பார்த்தது
ఆసిఫాబాద్: మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా సౌకర్యాలు కల్పించాలని, ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி