రెబ్బెన మండలం రాళ్లపేట గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు సతీష్ డిమాండ్ చేశారు. సోమవారం రాళ్లపేట గ్రామంలో ఆయన పర్యటించి సమస్యలపై మాట్లాడారు. ఎక్కడి చెత్త అక్కడే ఉందని చెత్తకుండిలు లేకపోవడంతో రోడ్డుపై చెత్తా చెదారం పేరుకు పోయిందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి పాల్గొన్నారు