జైనూర్ ఆదివాసి మహిళపై గత నెలలో జరిగిన హింసాత్మక దాడిలో నిందితుడైన ముగ్ధంపై పీడి ఆక్ట్ నమోదైనట్లు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి. వి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. నిందితులకు కఠినమైన శిక్షలు విధించే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం ముక్తకంఠంతో విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. పిడి యాక్ట్ నమోదు చేస్తూ నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.