యువత మానసిక ఉత్తేజం పొందటానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని రెహమాన్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. లింగాపూర్ మండలంలోని నిమ్మాతండాలో 10 రోజుల పాటు రెహమాన్ ఫౌండేషన్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. సోమవారం క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విన్నరప్ సహీదపూర్ జట్టుకు రూ.15000, రన్నరప్ కొత్తపల్లి జట్టుకు రూ.10000, తృతీయ బహుమతి లింగాపూర్ జట్టుకు రూ. 7500లు ఫౌండేషన్ ద్వారా బహుమతులు ప్రదానం చేశారు.