బెల్లంపల్లి ఏరియాలో నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కైరిగూడ వర్క్ షాప్ పలు డిపార్ట్మెంట్ లోని ఐ. ఎన్. టి. యు. సి ప్రతినిధుల బృందం కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.