రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, సర్వేలో పొరపాట్లు లేకుండా చూడాలని ఏఎస్ఓ మీరాబీ తెలిపారు. శనివారం వైరా రైతు వేదికల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర ఇంటింటి కులగణన కార్యక్రమంలో తప్పులు లేకుండా సర్వే సమగ్రంగా నిర్వహించాలని, ఆదివారం నుంచి స్టిక్కర్లు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.