వైరా మండలం లింగన్నపేటలో గురువారం సీపీఎం రూరల్ మండల మహాసభ నిర్వహించారు. పార్టీ నాయకులు ముందుగా గ్రామంలో ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. అనంతరం సభలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రైతులు, దళిత బలహీనవర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ హక్కులు హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.