ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాధపల్లి గ్రామంలో విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2023-2024 సంవత్సరాలు గాను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర సన్న రకం కింటాకు 2320 దొడ్డు రకం క్వింటాకు 2300 తెలపగా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి ప్రోత్సాహకరంగా 500 ప్రకటించిందని తెలిపారు.