సత్తుపల్లి మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. 30 నిమిషాల పాటు పట్టణంలో చెదురుమదురు వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ఎండ దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒకేసారి మబ్బులు కమ్మి వర్షం కురిసింది. అది తగ్గినప్పటి నుంచి ఉక్కపోత మొదలైంది. ఇక్కడ 10 రోజులుగా వాతావరణంలో మార్పులు కన్పిస్తూనే ఉన్నాయి. వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.