భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేసాపురం పంచాయతీ రైస్ పేట గ్రామంలో నివసిస్తున్న బొహర రాజేందర్ మద్యం మత్తులో శనివారం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. మండలంలో గుర్కా గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసై, ఈ క్రమంలోనే శనివారం తన భార్యతో గొడవ పడుతూ మద్యం మత్తులో ఇంట్లో ఉండే కూరగాయలు కత్తి తీసుకొని తన గొంతు తానే కోసుకున్నాడు.