రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మొదటి విడతలో ఇచ్చేందుకు నిర్ణయించామని, రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే అర్హులు అవుతారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని, పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని ఆదేశించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సోమవారం తిరుమలాయపాలెం మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.