ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శివాలయం రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరుగు నీరుతో పాటు చిన్నపాటి వర్షానికి రోడ్డంతా జలమయంగా మారుతుందని దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే బాటసారులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.