రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఆయన మాట్లాడగా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలోని సీసీఐ కొనుగోలు కేంద్రం నుంచి అధికారులు హాజరయ్యారు. ఈ మేరకు పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిర్దేశిత శాతం తేమ నమోదు రాగానే పత్తి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.