మధిర మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మండల హ్యూమన్ రైట్స్ సభ్యులు కోటా వెంకట్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.