మధిర మండల కేంద్రంలోని విజయదుర్గా కోల్డ్ స్టోరేజ్ ను ఆదివారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఇటీవల వచ్చిన వరదల కారణంగా కోల్డ్ స్టోరేజ్ లో 6 నుంచి 7 వేల బస్తాల మిర్చి వరద పాలు అయినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.