మధిర పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల ఐసిడిఎస్ అధికారులు మహిళా శిశు సంక్షేమం పై పాఠశాల బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మైనర్ బాలికలకు వివాహంపై, ఇంటర్నెట్ జోలికి వెళ్లొద్దని, మ్యాగీలు, కురుకురేలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తదితర అంశాలపై అవగాహన కల్పించారు.