ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పొందగా మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలపై తాజాగా ఆప్ క్లారిటీ ఇచ్చింది. కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లరని పేర్కొంది. అయితే కేజ్రీవాల్‌కు బదులు మనీష్ సిసోడియాను రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం.