తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. పోలీస్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకున్నారు.