పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పి అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసు చట్టాలు, కేసుల చెదన , నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు, డాగ్, బాంబ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, నిబంధనలు అవగాహన కల్పించారు.