వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జాతర నేపథ్యంలో మంగళవారం ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం ప్రారంభించారు. 14 ఉచిత బస్సులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్ తో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు