వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి కార్తిక మాసం సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలు వచ్చారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులతో తలనీలాలు సమర్పించి సేవలో తరించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో.. ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.