యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ రావు, నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకట రాంబాబు అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, మై భారత్-నెహ్రూ యువకేంద్ర కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకులు తదితరులున్నారు.