ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలని, ప్రతిరోజు వడ్ల తేమ శాతం రికార్డు చేయాలని, 17 శాతం తేమ రాగానే వడ్లు కొనుగోలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఏఓ రామకృష్ణ, ఆర్ఐ గౌతమ్, ఏపీఎం శైలజ శాంతి పాల్గొన్నారు.