పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం ధర్మారం పోలీస్ స్టేషన్ ను సీపీ సందర్శించారు. స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ ఉన్నారు.