పెద్దపల్లి: ఐఎన్ టీయూసికి రాజీనామా
పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన నాయకులు పెర్క రాజమల్లు తన వ్యక్తిగత కారణాలతో ఐఎన్ టీయూసిలో పని చేయలేక పోతున్నానని, అందుకే యూనియన్ కి రాజీనామా చేసినట్లు తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా అధ్యక్షుడు దాసుకు తన రాజీనామా లేఖను పంపించారు. ఇన్నేళ్లుగా యూనియన్ నుంచి తనకు అందించిన సహకారానికి రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు.