మెట్ పల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెట్ పల్లి పట్టణంలో శనివారం ఏఐటియుసి మున్సిపల్ కార్మిక రంగం రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్రన్, కార్యదర్శి వి జైపాల్ రెడ్డి, మెట్ పల్లి మున్సిపల్ కార్మికులతో సమావేశమైయ్యారు. అనంతరం సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు గత ప్రభుత్వం పెంచిన రూ.1000లు ఏడు నెలల బకాయిలు చెల్లించాలన్నారు. పనిముట్లు, పారాలు చీపిరిలు సబ్బులు బూట్లు బ్లౌజులు వెంటనే ఇవ్వాలన్నారు.