దశలవారీగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 3, 10, 22వ వార్డుల్లో మంగళవారం టీయూ ఎఫ్ఐడీసీ నిధులు 1 కోటి 32 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ ఎంపీపీ గోపగాని సరయ్య గౌడ్, సందవేణి రాజేందర్, మస్రత్ పాల్గొన్నారు.