ప్రజలకు మరింత చేరువయ్యేలా వైద్యారోగ్య శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష సమీక్షించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు.