ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, గంగారం, శ్రీరాంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల, మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం, శ్రీరాంపూర్ లో నిర్మాణమవుతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పెగడపల్లి గ్రామంలో జరుగుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్ వెంట డిసిఓ శ్రీమాల అధికారులు ఉన్నారు.