జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి కారుతో ఢీకొట్టి కత్తులతో పొడిచి చంపారు. తన అనుచరుడి హత్య విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి జాబితాపూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జగిత్యాలలోని పాత బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్నారు.