ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో ఆదివారం సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జి. ఎన్. సాయిబాబా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సాయిబాబా కుమార్తె మంజీర, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘం నేతలు, తదితరులు హాజరయ్యారు. సాయిబాబా ఉద్యమ సేవలను, హక్కుల సాధనకై ఆయన చేసిన సేవలను కొనియాడారు. నాన్న ఆశయాలను అందరం కలిసి కొనసాగిద్దాం అని అయన కూతురు జి.మంజీర అన్నారు.