జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మూత్రశాలల పక్కనే వంటలు చేస్తున్నారు. పాఠశాల తరగతి గదులకు సరిపడా స్థలం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండటం కోసం స్థలం లేకపోవడంతో పాఠశాలలోని మూత్ర శాలల పక్కనే వంట చేస్తున్నారు. ఈ క్రమంలో ఫుడ్ పాయిజన్ అయితే పరిస్థితి ఏమిటని శనివారం పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.