జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.