స్కానింగ్ సెంటర్ లను మంగళవారం మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు లోబడి పని చేయాలని ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రతి నెల ఫామ్ ఎఫ్ ఆన్లైన్లో సమర్పించి 5వ తేదీ లోపు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిపి ఎన్ డిటి టీమ్ మెంబర్స్ భూమేశ్వర్, రాజేశం హెల్త్ సూపర్వైజర్ శ్యామ్ పాల్గొన్నారు.