జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమాన్ వద్ద గల హనుమంతుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ద్వంసం చేశారు. ద్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్తలు తీసుకోవాలని హిందు సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు సోమవారం రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.