పగలు ప్రతీకారాలతో సాధించేదేమి లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని మల్యాల ఎక్స్ రోడ్ నుండి మేడిపల్లి మండలం కాచారం గ్రామం వరకు 25 కోట్లతో రోడ్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పని చేసి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు