జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహితాపూర్, రామోజీపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బి సత్య ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. వారి వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ ఎమ్మార్వో ఖయ్యూం, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.